Thursday, September 29, 2011

అందమైన మనసులో -2


రెండు రోజులు ఇట్టే రెండు క్షణాల్లా గడిచిపోయాయి పోయాయి కిరణ్.నేను మళ్ళీ వీలుచూసుకొని బెంగుళూరు వస్తాను అప్పుడు మళ్ళీ మిగిలిపోయిన కాలేజీ కబుర్లు చెప్పుకుందాం! - చిరునవ్వుల్ని పెదాలపై పులుముకుని బాధగా అన్నాడు కిరణ్ తో ఆదర్శ్

మనం కలసి ఇప్పటికి 6 సం,, అయింది ఇన్నిరోజులు నేను నవ్వుతూనే గడిపాను జీవితాన్ని,కాని ఇన్ని రోజుల తర్వాత నీతో గడిపిన ఈ రెండు రోజులు మనస్పూర్తిగా నవ్వాను ఆదర్శ్.- గుండెను భారం చేసుకొని అన్నాడు కిరణ్

వెళ్ళొస్తానండి - కిరణ్ వైఫ్ కి చెప్పడు ఆదర్శ్  
మంచిదండీ ఈ మారు వచ్చేప్పుడుమాత్రం మీ పాప మీ ఆవిడను మాత్రం తీసుకురావటం మర్చిపోకండి - నవ్వుతూ అంది కిరణ్ అర్థాంగి వైశాలి

ఆదర్శ్ ని రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేసి వస్తూ డిన్నర్ కి ఎదోఒకటి తీసుకొస్తాను - అని భార్యతో చెప్పి ఆదర్శ్ తో ప్రయాణమయ్యాడు కిరణ్    

స్టేషన్ కు చేరేవరకూ మళ్ళీ అవే కాలేజీ కబుర్లే...
                             
                            ************
ఆదర్శ్-కిరణ్ లు P.Gలో స్నేహితులయ్యరు.కాలేజీ లో వారి అల్లరి మాళ్ళీ ఆ అల్లరి పైకి కనిపించని అమాయకత్వం నిజంగా ఆ రోజులని జీవితంలో గుర్తుంచుకొనే క్షణాలుగా మలచుకున్నారు.అంతే కాకుండా వారి చదువు అయిపోయాక కూడా కొన్నిరోజులు ఉద్యోగం వేట లో ఒకే హాస్టల్ లో గడిపారు.కిరణ్ తన P.G Final Exam కు ముందే ప్రేమలో లో పాస్ అయ్యడు(పాస్ అయ్యననుకునే ఫెయిల్యూర్ అది).ఇప్పుడు ఉద్యోగం రీత్యా వేర్వేరు ప్రాంతాలలో ఉంటున్నారు .టెక్నాలజీ పెరిగినా ఫోనులో కబుర్లు తక్కువే వారి మధ్య,ఇక పెళ్ళి తర్వత తెలియని బాధ్యత కిరణ్ ని ఆవహించింది! అందుకే కిరణ్ కి వైశాలి నే లోకం ఇంటెర్నెట్ వాడటం స్నేహితులతో లేట్ నైట్ పార్టీలు ఎప్పుదో బంద్ అయిపోయి కిరణ్ లైఫ్ లో. మా రా ల న్న ఉద్దేశం కిరణ్ కి లేదు మా ర్చే ఉద్దేశం ఆదర్శ్ కి లేదు.  

Wednesday, September 28, 2011

అందమైన మనసులో-1


మొదలైంది......






నా పేరు ఆదర్శ్
31 సం,,
ఎన్నో కలలు,ఎన్నో ఆశలు మరెంతో నిరీక్షణ.ఇప్పుడదంతా పాతకథ! నేను,నా భార్య మా గారలపట్టి సృష్టి శ్రీనిధి.ఇదీ నా అందమైన లోకం. ఇప్పుడింత సంతోషంగా ఉన్నా.నా యీ సంతోషాల మధ్యకి ఒకే ఒక్క అబద్దం మాత్రం రాకూడదని ఎప్పుడూ అనుకుంటుంటాను.ఎందుకంటే ఇదే ఇప్పుడు నా లోకం.ఇదే నిజం!

అవును ఇదే...నిజం!
అపుడు చెప్పలేకపోయిన నా మనసు,
నువు ఎప్పటికైనా వస్తావనే ఆశతో మూగబోయింది.
నీవులేని క్షణాలు నను ఉక్కిరిబిక్కిరి చేసాయి,
అది నిజమేనన్న బ్రమలో ఇంకొన్నాల్లు గడిచాయి,
ఆ అబద్దపు జీవితంలో ఒక్కోక్షణాన్ని యుగంలా గడిపాను...
వెలుగులో చీకటిని చూసాను,
నీటిలో ఎండమావిని వెదికాను,
పట్టపగలు వెన్నెలకై వేచాను,
నడిరేయిలో నీకై ఎదురుచూసాను,
నీ పేరునే రాస్తూ పరవశించిపోయాను,
అనుక్షణం నీరాకకై పరితపించిపోయాను,
ఇంకొన్నాళ్ళు ఇలానే వుండివుంటే....
నేటి నిజానికి చేరుకోలేకపోయేవాడ్నే!
మెల్లగా...పని వ్యాపకమైంది,
పెళ్ళితో నిజమైన ప్రేమ దొరికింది,
ఇక ఆ తర్వాత ఎపుడూ ఆ అబద్దపుజీవితం,
నా కలలో కూడా కనిపించేంత ధైర్యం చేయలేకపోయింది.
అబద్దమా......
ఇప్పుడు నీవెక్కడున్నావు?
ఒకవేళ నాప్రక్కనే ఉన్నా ...నా ఎదుటికిక ఎప్పటికీ రాకు.. 



ఇక నా పరిచయ వాక్యాలు అయిపొయాయి మరి నవలలోకి వెళ్ళిపోండి :)
అయితే మీరు కూడా నాకు దూరయైన అబద్దం నాకెప్పుడూ ఎదురవ్వొద్దని కోరుకోండి...
                                                                                                                మీ,
                                                                                        ఆదర్శ్                                                                                                              
                                                                       


                                                                                                                          
                       *********