మొదలైంది......
నా పేరు ఆదర్శ్
31 సం,,
ఎన్నో కలలు,ఎన్నో ఆశలు మరెంతో నిరీక్షణ.ఇప్పుడదంతా పాతకథ! నేను,నా భార్య మా గారలపట్టి సృష్టి శ్రీనిధి.ఇదీ నా అందమైన లోకం. ఇప్పుడింత సంతోషంగా ఉన్నా.నా యీ సంతోషాల మధ్యకి ఒకే ఒక్క అబద్దం మాత్రం రాకూడదని ఎప్పుడూ అనుకుంటుంటాను.ఎందుకంటే ఇదే ఇప్పుడు నా లోకం.ఇదే నిజం!
అపుడు చెప్పలేకపోయిన నా మనసు,
నువు ఎప్పటికైనా వస్తావనే ఆశతో మూగబోయింది.
నీవులేని క్షణాలు నను ఉక్కిరిబిక్కిరి చేసాయి,
అది నిజమేనన్న బ్రమలో ఇంకొన్నాల్లు గడిచాయి,
ఆ అబద్దపు జీవితంలో ఒక్కోక్షణాన్ని యుగంలా గడిపాను...
వెలుగులో చీకటిని చూసాను,
నీటిలో ఎండమావిని వెదికాను,
పట్టపగలు వెన్నెలకై వేచాను,
నడిరేయిలో నీకై ఎదురుచూసాను,
నీ పేరునే రాస్తూ పరవశించిపోయాను,
అనుక్షణం నీరాకకై పరితపించిపోయాను,
ఇంకొన్నాళ్ళు ఇలానే వుండివుంటే....
నేటి నిజానికి చేరుకోలేకపోయేవాడ్నే!
మెల్లగా...పని వ్యాపకమైంది,
పెళ్ళితో నిజమైన ప్రేమ దొరికింది,
ఇక ఆ తర్వాత ఎపుడూ ఆ అబద్దపుజీవితం,
నా కలలో కూడా కనిపించేంత ధైర్యం చేయలేకపోయింది.
అబద్దమా......
ఇప్పుడు నీవెక్కడున్నావు?
ఒకవేళ నాప్రక్కనే ఉన్నా ...నా ఎదుటికిక ఎప్పటికీ రాకు..
ఇక నా పరిచయ వాక్యాలు అయిపొయాయి మరి నవలలోకి వెళ్ళిపోండి :)
అయితే మీరు కూడా నాకు దూరయైన అబద్దం నాకెప్పుడూ ఎదురవ్వొద్దని కోరుకోండి...
మీ,ఆదర్శ్
*********
చాలా బాగుంది..
ReplyDeleteఅందమైన అబద్దం కన్నా ఆనందమిచ్చే నిజమే మిన్న..